సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

Dec 13,2023 22:50
స్థానిక పరిశ్రమల్లో

ప్రజాశక్తి – పెద్దాపురం

అంబేద్కర్‌ ఆశయ సాధనలో భాగంగా దళితవాడల్లో సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ రాష్ట్ర నాయకులు తాడి బాబ్జి, ప్రసాద్‌ పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్‌ సెంటర్లోని అంబేద్కర్‌ భవనంలో బుధవారం జరిగిన దళితుల ఐక్యతా సభలో వారు మాట్లాడుతూ రాజకీయ నాయకులు దళితులను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం తప్ప దళితుల అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. దళిత కుటుంబాలు విద్యావకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. స్థానిక పరిశ్రమల్లో దళితులకు ఉపాధి కల్పించాలన్నారు. స్థానిక నాయకులు గుర్రాల యాకోబు, ఆరేళ్ల వీరరాఘవ, జాలా దావీదు, పెద్దింటి మరిడియ్య, బేదంపూడి సత్తిబాబు, కేటి శ్రీను, తలారి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️