సమస్యల పరిష్కారానికి కృషి

Mar 26,2024 21:38

ప్రజాశక్తి – విజయనగరం కోట : ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు అన్నారు. మంగళవారం స్దానిక సిపిఐ కార్యాలయంలో ఎపి పిటిడి ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమావేశాన్ని నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ త్వరలో అందరికి లామినేటెడ్‌ డిజిటల్‌ ఇండెంటిటీ కార్డులు, అన్ని కేటగిరుల సిబ్బందికి ఐదు సంవత్సరాలకు ఒక సారి రెన్యూవల్‌ చేసుకొనే పద్ధ్దతిలో ఇస్తున్నారని తెలిపారు. 2017 పే-స్కేల్స్‌ అరియర్స్‌ 2030 వరకు రిటైర్‌ అయిన వారికి ఇ.యు రాష్ట్ర కమిటి కృషి మేరకు చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలి ఉన్నవారిలో 2031 నుండి 2060 వరకు రిటైర్డ్‌ అయ్యే వారికి ఇప్పుడు 50శాతం ఇస్తున్నారన్నారు. ఇంకో 50శాతం పూర్తిగా ఒకే సారి ఇవ్వాలని కోరామ న్నారు. ఇ.యు డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పి.బానుమూర్తి మాట్లాడు తూ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులను ఆర్‌టిసి ఎండి దృష్టికి తీసుకెళ్లామన్నారు.నూతన కమిటీ ఎన్నికవిజయనగరం ఆర్‌టిసి ఇ.యు జిల్లా నూతన కమిటి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు గా కె.కృష్ణారావు (యస్‌. కోట డిపో), వర్కింగు ప్రెసిడెంటు టి.వి.కె.యస్‌.నారాయణ, జిల్లా కార్యదర్శి జి.రవికాంత్‌, కోశాధికారి సి.హెచ్‌.పి.పట్నాయక్‌తో పాటు మరో ఆరుగురి సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఇ.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదమజ్జి సత్యన్నారాయణ, జోనల్‌ కార్యదర్శి బాసూరి కృష్టమూర్తి, జోనల్‌ నాయకులు కె.వి.రమణ, యం.సత్యవతి, బి.జనార్దన, ఉమెన్‌ కమిటి జిల్లా నాయకురాలు డి.అరుణ, జిల్లా నాయకులు, యస్‌.కోట, విజయనగరం డిపో అధ్యక్షులు ఏ. శ్రీనివాసరావు, కె.యన్‌.స్వామి, కొల్లికోటేశ్వరరావు, చవక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️