సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ప్రజాశక్తి-దర్శి: పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు పోరాటాలు ఆగవని సీఐటీయు దర్శి డివిజన్‌ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా రంగారావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. పారిశుధ్య కార్మికులకు అలవెన్స్‌ ఇవ్వాలని, ఆప్కాస్‌లో చేర్చాలని పోరాడుతున్నా పరిష్కరించలేదన్నారు. ఈ కార్యక్రమానికి గర్నెపూడి ఇర్మియా అధ్యక్షత వహించగా నాయకులు మరియమ్మ, కోటయ్య, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

➡️