సమ్మెకు సంతకాలతో సంఘీభావం

వినుకొండ శిబిరంలో అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ – హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం స్టేషన్‌రోడ్డులోని గాంధీపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో సమ్మె శిబిరాన్ని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి సయ్యద్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకులు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీసెంటర్‌ను మెయిన్‌ సెంటర్‌గా మార్చాలనే డిమాండ్లు చాలా న్యాయమైనవని చెప్పారు. వీటి సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె చారిత్రాత్మకమైందని, పండగ రోజుల్లో సైతం వారు పోరాడుతున్నా ప్రభుత్వం మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. సమ్మెకు సంఘీభావంగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా కోశాధికారి గుమ్మడి రాఘవయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, హక్కులపై ఎస్మా చట్ట ప్రయోగం సరికాదని అన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ పనులు మాని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తోందని, అధికారులతో బెదిరి ంపులు, షోకాజు నోటీసులు జారీ ఇందు లో భాగమని మండిపడ్డారు. వీటన్నింటికీ అంగన్వాడీలు వెరవబోరని, ప్రభుత్వం దిగొచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తారని స్పష్టం చేశారు. అంగన్వాడీల పోరాటంలో అధికారులు, లబ్ధిదార్లు, ప్రజలు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో యూని యన్‌ నాయకులు బి.నిర్మల, శోభారాణి, డి.మాధవి, సాయి, బివి రమణ, బి.పిచ్చ మ్మ, బి.కౌసల్య, పి.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక శాఖ గ్రంథాలయం వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం సమ్మె శిబిరంలో దీక్షలు చేశారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు, కెవిపిఎస్‌ నాయకులు ఎం.విల్సన్‌, అంగన్వాడి యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : సురేష్‌ మహల్‌ రోడ్డులోని సమ్మె శిబిరం కొనసాగుతోంది. ‘జగనన్న నీ మూర్ఖత్వానికి ఓ దండం’ అంటూ అంగన్వాడీలు ఒంటికాలుపై నిలబడి కొందరు, దండాలు పెడుతూ మరికొందరు నిరసన తెలిపారు. యూనియన్‌ జిల్లా ట్రెజరర్‌ ఎఎల్‌.ప్రసన్న మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు మూసేసి ఉండడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లేవారని, ఇప్పుడు వారు పనులకు వెళ్లలేని కారణంగా ఆదాయాలు కోల్పోతున్నారని చెప్పారు. మరోవైపు పోషకాహారమూ అందడం లేదని, సత్వరమే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించడం ద్వారా సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివరామకృష్ణ, ఎఐటియుసి నాయకులు మారుతి వరప్రసాద్‌, యు.రాము, బి.శ్రీను, ఎ.ఆంజనేయులు జి.పద్మ, బి.శ్రీదేవి, నిర్మల, సిహెచ్‌ గాయత్రి పి.భూమా, పి.ఉమాశంకరి, హరిత, రాజకుమారి, నాగజ్యోతి, కృష్ణకుమారి, డి.బీబులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : సమ్మె శిబిరాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు సందర్శించి మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకు ప్రభుత్వం భయపడుతోందని, ఎస్మా చట్ట ప్రయోగం, నోటీసుల జారీ ఇందకు ఉదాహరణని అన్నారు. నాయకులు నూర్‌బాషా సైదులు, డివైఎఫ్‌ఐ నాయకులు జె.రాజ్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు జి.సుజాత, అహల్య, నాయకులు ధనలక్ష్మి, చాముండే శ్వరి, దుర్గాభవాని, పద్మ, ముప్పాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి పట్టణ, సత్తెనపల్లి రూరల్‌ అంగన్వాడీలు పాల్గొన్నారు.ప్రజాశక్తి – క్రోసూరు : సమ్మె శిబిరం వద్ద ‘జగనన్నకు కోటి సంతకాలతో చెబుదాం’ పేరుతో సంతకాల సేకరణ ప్రారంభించారు. జయలక్ష్మి , మెరీనా, నాగమల్లేశ్వరి, సైదాబాయి, ఆశాబేగం, ధనలక్ష్మి, వెంకట్రావమ్మ, పుష్పలత పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సమ్మె శిబిరం కొనసాగుతోంది. శిబిరంలో దీక్షలు చేపట్టారు. యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ హజ్ర, డి.శాంతమణి మాట్లాడారు. సమ్మె తమ హక్కని దీన్ని హరించే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరచూపాలని, లేకుంటే సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అవసరమైన రాష్ట్ర బంద్‌ చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మండల కన్వీనర్‌ డి.భూలక్ష్మి అందజేశారు. నాయకులు బుజ్జి, సుజాత, వెంకటరమణ, కవిత, హసీనా, శోభారాణి, సుశీల ధనలక్ష్మి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.గురజాల ప్రాజెక్టు పరిధిలో 37వ నంబర్‌ ముగ్గు వేసి నిరసన తెలిపారు. సంతకాల సేకరణ చెపట్టారు. సిఐటియు నాయకులు టి.శ్రీనివాసరావు మాట్లాడారు. దేవకుమారి, ఉమామహేశ్వరి, సైదాబీ, శ్రీదేవి, నాగకుమారి, జ్యోతి, మల్లీశ్వరి, నారాయణమ్మ, భవాని, ప్రమీల పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు నాయకులు బి.మహేష్‌ మాట్లాడుతూ సమ్మెలో ఉన్న అంగన్వాడీలను నోటీసుల పేరుతో బెదిరిచండం ప్రభుత్వానికి తగని పని అని అన్నారు. నోటీసులపై రాష్ట్ర నాయకత్వం కోర్టుకు వెళుతుందని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవించి కనీస వేతనం, గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. యూనియన్‌ నాయ కులు ఉషారాణి, ఇందిర, కె.పద్మావతి, శాంతలత, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతి, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లీశ్వరి పాల్గొన్నారు.

➡️