సమ్మె నోటీసు అందజేత

Dec 19,2023 21:51 #muncipal workers
ఫొటో : నోటీసును అందజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఫొటో : నోటీసును అందజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
సమ్మె నోటీసు అందజేత
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : సిఐటియు ఆధ్వర్యంలో 26వ తేదీ నుండి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలోని టిపిఒ ఎ.బాబురావుకు సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నో దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కరోనా నుండి ఇప్పటి వరకు డెయిలీ కార్మికులగా పనులు చేస్తున్న కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని, రిటైర్డ్‌ అయిన వారి స్థానంలో వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనెఫిట్స్‌, పెన్షన్‌ విధానం అమలు చేయాలని, కనీసం వేతనం రూ.26వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పర్మనెంట్‌ హామీని అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. గత్యంతరం లేక సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 26వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య, సిఐటియు నాయకులు వై.కృష్ణమోహన్‌, బి.కృష్ణయ్య, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, బి.మహేష్‌, కె.భాస్కర్‌, కే. బాబు, పి. అనిత తదితరులు పాల్గొన్నారు.

➡️