సమ్మె విరమించి సంబరాలు

అమరావతిలో విజయోత్సవ సభలో అంగన్వాడీలు

క్రోసూరు: సమరశీల పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు అన్నారు. అంగన్వాడి సమ్మె జయప్రదం అయిన నేపథ్యంలో క్రోసూరు లోని సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలు మంగళవార ం సంతోషం వ్యక్తం చేశారు. సిఐటియు జెండాలు చేతబూని ఉత్సాహంతో వారు నృత్యం చేశారు. టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా అంగన్వాడీల సమ స్యలపై చర్చించటానికి అవకాశం ఇవ్వని ప్రభుత్వాన్ని, జీతాలు పెంచుతామని లిఖిత పూర్వకమైన హామీ పొంది, ఇతర సమ స్యల పరిష్కారం చేస్తామని ప్రకటించే విధంగా అంగన్వాడీల నిరవధిక సమ్మె చేసిందని అన్నారు. సిఐటియు నాయ కత్వం లోని అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మీద నమ్మకంతో సమరశీలమైన ఉద్యమంలో అంగన్వాడీలు నిలబడటం వలన ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చిందని అన్నారు.అంగన్వాడీలకు సిఐ టియు జేజేలు పలుకుతోందని అన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు క్రోసూర్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కార్యదర్శి బి.జయలక్ష్మి మాట్లా డుతూ యూనియన్‌పై నమ్మకంతో వ్యక్తి గతంగా ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికీ నిలబడినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ క్రోసూరు ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు జి.శివపార్వతి,నాయకులు ఈ మెరీనా, భూలక్ష్మి, విజయలక్ష్మి, ఎం విజయ కుమారి,ఆషా,శోభ, వెంకాయమ్మ , సిహెచ్‌ విజయనిర్మల, ఎ.మంగమ్మ, ధనలక్ష్మి, దానమ్మ, శ్రీలక్ష్మి, రహీమున్నీసా, నిర్మల పాల్గొన్నారు.

చిలకలూరిపేట: అంగన్వాడీల సమ్మె విజయవంతం కావడంతో వారు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. స్టానిక పండరీపురం రెం డవ లైన్‌లోని సిఐటియు కార్యాలయంలో అంగన్వాడి వర్కర్లు అండ్‌ హెల్పర్లు (సిఐ టియు) యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళ వారం కేక్‌ కట్‌ చేశారు. సమ్మె అనంతరం సాధించుకున్న 11 డిమాండ్ల కోసం నిరం తరం పోరాడిన వారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి 11 డిమాం డ్లను ఆమోదించి నందుకు రాష్ట్ర ప్రభు త్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనేక బెదిరింపులకు బెదరక, ఒత్తిళ్లకు తలొగ్గక,ఆర్థికంగా సర్దుబా టు చేసుకుంటూ సహనంతో ఉద్యమానికి పూర్తిగా సహకరించిన ప్రతి ఒక్క అంగ న్వాడీ కార్యకర్తకు, టీచర్లకు, ఆయాలకు, సెక్టార్‌ లీడర్లకు ఈ సందర్భంగా యూని యన్‌ నాయకురాలు జి.సావిత్రి,సెక్టార్‌ లీడర్లు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి యడ్ల పాడు నాయకులు పీటర్‌ విప్లవ గీతాలు పాడి ఉత్సాహపరిచారు. అనంతరం సిఐ టియు, యూటిఎఫ్‌ నాయకులు ప్రసంగిం చారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం అధ్యక్షు లు వై రాధాకృష్ణ రైతు సంఘం డివిజన్‌ కార్యదర్శి బి.శం కరరావు, సిఐటియు కార్యదర్శి టి.కో టేశ్వర రావు, కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు రోశయ్య, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసులురెడ్డి, పల్నాడు జిల్లా తిరుపతి స్వామి, కెవిపిఎస్‌ పల్నాడు జిల్లా స హాయ కార్యదర్శి ఎం.విల్సన్‌ రైతు సంఘం యడ్లపాడు నాయకులు ఎ. సుబ్బారావు, ఎస్‌.బాబు,టి.ప్రతాప్‌రెడ్డి పి. గోపి, అంగన్వాడీలు టీచర్లు, సెక్టార్‌ లీడర్లు రమాదేవి, ఎ.పద్మావతి, రాజేశ్వరి,గౌరీ, నాగలక్ష్మి,రాధా,సుబ్బాయమ్మ వెంకా యమ్మ, మాధవి,రత్నకుమారి, పరిమళ, రజిని, రాణి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు మండల కన్వీనర్‌మ పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ విజయం అందరి ఐక్యత కృషి వల్ల సాధ్య మైందన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం చేసిన వారికి,మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలు, అఖిల పక్షాల వారికి,ప్రజా సంఘాల కు, ఉపాధ్యాయు లకు, దళిత గిరిజన సంఘాల వారికి జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు.

మాచర్ల: సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేసిన పోరాటం చారి త్రాత్మకమైందని సిఐటియు నాయకులు బండ్ల మహేష్‌ అన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలపై ప్రభు త్వానికి, సంఘ నాయకులకు మధ్య చర్చ లు ఫలించి సమ్మె విరమించిన నేపథ్యంలో స్ధానికి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలను ఉద్దేశించి ఆయన మాటా ్లడారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు జరిపిన పోరాటం ఎన్నో కార్మిక సం ఘాలకు మార్గదర్శకంగా నిలుస్తుంద న్నారు. సాధారణ మహిళలు ఆసాధారణ ఉద్యమం చేపట్టారని ప్రశంసించారు. ఐకమత్యంతో పోరాటం చేస్తే సమస్యలను పరిష్కరించుకోగలమని మరోసారి రుజు వైందనిఅన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటరత్నం, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ఉషారాణి, ఇం దిర, కె.పద్మావతి, కోటేశ్వరి, సుందర లీల, శారద, దుర్గా శివలక్ష్మి,, రుక్మిణి, జయ లక్ష్మి, శివపార్వతి, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.

అమరావతి: కార్మిక వర్గ పోరాట స్ఫూర్తిని చారి త్రాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ లో అంగన్వాడి ఉద్యమం చిరస్థాయిగా నిలు స్తుందని సిఐటియు మండల కార్యదర్శి బి. సూరిబాబు అన్నారు. విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా హక్కులు సాధించుకోవడంలో ఐక్యత కనబరిచిన అంగన్వాడీలకు సిఐ టియు అభినందనలు తెలియజేస్తోందని అన్నారు.

➡️