సర్వశిక్ష ఉద్యోగుల పెన్‌ డౌన్‌

Dec 16,2023 21:38

ప్రజాశక్తి – గరుగుబిల్లి :  సమగ్ర శిక్ష ఉద్యోగులకు తక్షణమే పెండింగ్‌ బకాయి వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నుంచి పెన్‌డౌన్‌ కార్యక్రమం చేపడుతున్నారు. స్థానిక ఎమ్మార్సీ భవనంలో పెన్‌డౌన్‌ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఎంఇఒ నగిరెడ్డి నాగభూ షణరావుకు సమగ్రశిక్ష ఉద్యోగులు బోను రామకృష్ణ, రేగిడి రాంబాబు, రమణమ్మ, వాకాడ శారద, తదితరులు నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగు జీతాలను తక్షణమే విడుదల చేయడంతో పాటు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రస్తుతం పెన్డౌన్‌ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈనెల 20లోగా సమస్యల పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేయనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఆర్పిలు ఎడ్ల యశోద, ఎం.శంకరరావు, ఐసిఆర్‌టి యర్రా వీర్రాజు, తది తరులు పాల్గొన్నారు.

➡️