సాబ్జికి ఉపాధ్యాయులు, విద్యార్థుల నివాళి

ప్రజాశక్తి – పెదకూరపాడు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జి మరణం ఉపాధ్యాయ లోకానికి, ఉద్యమాలకు తీరని లోటని పెదకూరపాడు జెడ్‌పి పాఠశాల హెచ్‌ఎం కె.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో సాబ్జి చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పూలమాలలేసి నివాళులర్పించారు. ఉద్యమాల ద్వారా ఎన్నో విజయాలకు సాబ్జి శ్రీకారం చుట్టారని, ఆయన స్ఫూర్తితో యువత, విద్యార్థులు, సమాజం హక్కులు సాధించుకోవడానికి కంకణం కట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సాంబశివరావు, మర్రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్‌ సిహెచ్‌ నాగరాజు, రాధాకృష్ణ, నరేష్‌, శ్రీకాంత్‌, కన్యాకుమారి, దయామణి, రజియా, సత్యవతి, మహేశ్వరి పాల్గొన్నారు.

➡️