సామాజిక కార్యకర్తలకు సన్మానం

ప్రజాశక్తి – బెలగాం : అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులను ఐఆర్‌పిడబ్ల్యు సంస్థ ఆధ్వర్యాన సన్మానించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ మంచుపల్లి శ్రీరాములు, కమిటీ సభ్యులు కామకృష్ణ, జిల్లేడుముడి అనసూయమ్మను సన్మానించారు. వీరిని ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిద్య మండలి వారు సహకారంతో వివిధ పండ్లు, ఔషధ మొక్కలు సామాజిక కార్యకర్తలకు అందజేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఐఆర్‌పిడబ్ల్యు సంస్థ డైరెక్టర్‌ ప్రకాష్‌, లక్ష్మణ, మున్సిపల్‌ ఉద్యోగి ఆకుల శ్రీనువాస్‌, జనార్ధన్‌, నిరాశ్రయుల వసతి గృహంలో సిబ్బందిగా పనిచేస్తున్న గణేష్‌, జానీ, దయ, వెంకటరమణ పాల్గొన్నారు.

➡️