సామాజిక భవనం ప్రారంభం

Mar 11,2024 21:16

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 27వ డివిజన్‌ రెల్లి వీధిలో నూతనంగా ఏర్పాటుచేసిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామితో కలిసి రాష్ట్ర రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మధుసూదన్‌ రావు ప్రారంభించారు. రూ.36 లక్షలతో ఏర్పాటు చేసిన సామాజిక భవనం తమ వర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని మధుసూదనరావు అన్నారు. ఇటీవల లంకాపట్నం లో రూ.80 లక్షలతో సామాజిక భవనాన్ని నిర్మించి తమ వర్గానికి అందించగా, తాజాగా రూ.36 లక్షలతో సామాజిక భవనాన్ని మరో భవన అభివృద్ధి పనులను పూర్తి చేసి అందించడం అభినంద నీయమని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, స్థానిక కార్పొరేటర్‌ దుప్పాడ సునీత, మాజీ కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.సిసి రోడ్డు ప్రారంభంనగరంలోని 29వ డివిజన్‌ మహాలక్ష్మి నగర్‌ లో నూతనంగా ఏర్పాటు చేసిన 3 సిసి రహదారులను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ సమస్యలేని నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అనేక విధాల కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో యువజన నాయకులు ఈశ్వర్‌ కౌశిక్‌, అచ్చిరెడ్డి, నాగిరెడ్డి ,గుణ తదితరులు పాల్గొన్నారు.

➡️