సామాజిక విప్లవ వనిత సావిత్రి బాయిఫూలే

ప్రజాశక్తి-పీలేరు సామాజిక విప్లవ వనిత సావిత్రి బాయిఫూలే అని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మండలంలోని బంగారం ఎస్‌సి కాలనీలో సావిత్రిబాయి ఫూలే 127వ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి మహిళలు, ప్రజాసంఘాలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అయిన ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కషి చేశారన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని గట్టిగా నమ్మిన ఆమె, తన భర్త జ్యోతిరావుఫూలేతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభిచారని పేర్కొన్నారు. కుల వ్యవస్థకు, పితస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పశ్యత, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా దంపతులు భావించారని అన్నారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారని గుర్తు చేశారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులకు ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసని, కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని, పీడిత ప్రజల, స్త్రీల విద్యాభివద్ధికి కషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, బాల్య వివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువుల పునర్వీవాహలు, అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిన సామాజిక విప్లవకారిణి అని కొనియాడారు. కార్యక్రమంలో మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు కె. గట్టప్ప, మాలమహనాడు రాయలసీమ జిల్లాల సహయ కార్యదర్శి నగరిమడుగు సుభాష్‌, భారతీయ అంబేద్కర్‌ సేనా సమితి అన్నమయ్య జిల్లా నాయకులు ముల్లంగి క్రిష్ణయ్య, జాతీయ అంబేద్కర్‌ సేవా సంఘం అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి మచ్చ రెడ్డయ్య, మాలమహనాడు మండల ప్రచార కార్యదర్శి దప్పేపల్లి ఆనంద్‌, కోశాధికారి మద్దెల బాలగంగాదర్‌, కార్యవర్గ సభ్యులు విజరు,ఆశ కార్యకర్త తేనేపల్లి రెడ్డమ్మ, వరలక్ష్మి, రూపా, ప్రస్సన్న, నీలావతి, సుబ్బమ్మ, రాణెమ్మ, నాగరత్న, శ్రీలేఖ, గుర్రప్ప, వెంకట రమణ, సురేంద్ర, సుబ్రహ్మణ్యం, చెంగల్‌ రాయులు, రెడ్డప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️