సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేయాలి

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ రాణి

ప్రజాశక్తి-మండపేట

నియోజకవర్గ నలుమూలల నుంచి బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు తరలివచ్చి బిసి సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి కోరారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో ఛైర్‌పర్సన్‌ రాణి మాట్లాడుతూ సిఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పాలనకు మద్దతుగా నియోజక వర్గ పరిధిలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బిసి సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలన్నారు. కార్యక్ర మంలో టౌన్‌ కన్వీనర్‌ ముమ్మిడివరపు బాపిరాజు, షేక్‌ మరియు షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ షేక్‌ అలీఖాన్‌ బాబా, కౌన్సిల్‌ విప్‌ పోతంశెట్టి ప్రసాద్‌, కౌన్సిలర్‌ నీలం దుర్గ, వైసిపి నాయ కులు మొండి మురళి పాల్గొన్నారు.

 

 

➡️