సిఎంకు ఉత్తరం.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

పిడుగురాళ్లలో బొల్లా బ్రహ్మనాయుడు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం గాంధీ పార్క్‌ వద్దగల సమ్మె శిబిరం నుండి తపాలా కార్యాలయం వరకు అంగన్వాడీలు భారీర్యాలలీ చేశారు. సిఐటియు రొంపిచర్ల మండల కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లా డారు. అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, నాయకులు బి.నిర్మల, బి.సాయి కుమారి, డి.మాధవి, కవిత, విజయలక్ష్మి, లుదియమ్మ, ఎఐటియుసి నాయకులు హెల్డా ఫ్లారిన్స్‌, శోభారాణి, రాజ కుమారి, హసీనా పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : స్థానిక తాలూకా సెంటర్లో సమ్మె శిబిరం కొనసాగింది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. సమ్మె శిబిరాన్ని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు వి.చంద్రకళ, సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు జె.రాజ్‌కుమార్‌ సందర్శించి మద్దతు తెలిపారు. యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సుజాత మాట్లాడారు. కార్యదర్శి ఎం.అహల్య, సెక్టార్‌ లీడర్లు భవాని, ధనలక్ష్మి, చాముండేశ్వరి, పద్మ, జ్యోతి, అంజలి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – అమరావతి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో పోస్ట్‌ కార్డు ఉద్యమం చేశారు. నాయకులు లీలా, రాధా, ఉమా, సుభాషిణి మాట్లాడారు. సిఐటియు మండల కార్యదర్శి సూరిబాబు, అగన్వాడీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడారు. నాయకులు షేక్‌ రఫీ, ఎం.సుబ్రహ్మణ్యం, నాగుల్‌ మీరా, సయ్యద్‌ మోదిన్‌వలి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ అంగన్వాడీలు రాలీ చేశారు. పోస్టు కార్డులు చూపుతూ ఒంటికాలిపై నిలిచి నిరసన తెలిపారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలను అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. వీరికి విశ్రాంత ఎక్సైజ్‌ సిఐ గోరంట్ల నారాయణస్వామి మద్దతు తెలపడంతోపాటు రూ.5 వేల విరాళం అందించారు. జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు డి.బుచ్చిబాబు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ, షేక్‌ సుభాని సంఘీభావం ప్రకటించారు.
ప్రజాశక్తి – యడ్లపాడు : తమకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. సిఎంకు ఉత్తరాలు రాసి వాటిని పట్టుకుని ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. నాయకులు పరిమళ, అరుణ, పద్మ,, రజిని, సుస్మిత, కోటేశ్వరమ్మ, కోమలి, లక్ష్మీ తిరుపతమ్మ పాల్గొన్నారు. సిఐటియు నాయకలు టి.కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య, రైతు సంఘం నాయకులు ఎన్‌.కాళిదాసు సంఘీభావం తెలిపారు.
ప్రజాశక్తి – క్రోసూరు : సమ్మె శిబిరాన్ని కౌలు రైతు సంఘం నాయకులు టి.హనుమంతరావు సందర్శించి మాట్లాడారు. బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అంగన్వాడీలు నల్ల రిబ్బన్లు కట్టుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సమ్మె శిబిరంలో అంగన్వాడీలు సిఎంకు ఉత్తరాలు రాశారు. వినుకొండ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ బంగ్ళా సెంటర్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన వీధి రౌడీలా ప్రవర్తించారని సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మండిపడ్డారు. నాయకులు బి.నాగేశ్వరరావు, శాంతమణి, షేక్‌ హజర, బుజ్జి, కవిత, శివరంజని, వెంకటరమణ, లక్ష్మి, జయశ్రీ, శాంతి కుమారి, సరస్వతి, గంగాభవాని పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : అంగన్‌వాడీల సమస్యలు ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డికి తెలుసునని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మాచర్ల పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గోనేందుకు వచ్చిన ఆయనుకు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా సమ్మె శిబిరం నుండి పోస్టుల కార్డులను అంగన్వాడీలు సిఎంకు పంపించారు. గురువారం సమ్మె శిబిరాన్ని యూనియన్‌ నాయకురాలు ఉషారాణి ప్రారంభించి మాట్లా డారు. ఇందిరా, పద్మావతి, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, యుటిఎఫ్‌ నాయకులు జెవికెఎస్‌ ప్రసాద్‌, ఎ.నాసర్‌రెడ్డి, నజీర్‌, యువి రావు, బాలాజీనాయక్‌, పి.రామారావు, సిఐటియు నాయకులు బి.మహేష్‌ సంఘీభావం తెలిపారు.
ప్రజాశక్తి – పెదకూరపాడు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో సిఎంకు కార్డులు రాసి ప్రదర్శించారు.

➡️