సిఎం జగన్‌ రైతులు పక్షపాతి :’చింతల’

ప్రజాశక్తి-కలికిరి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల కేంద్రం లోని మదనపల్లిరోడ్డులో గల సిఎల్‌ఆర్‌సి భవనంలో నియోజకవర్గంలో జలకళ ద్వారా లబ్ధి పొందిన రైతులకు వ్యవసాయ బోరు, మోటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జలకళ పథకం ద్వారా లబ్ధిదారులైన రైతులకు 7 లక్షల నుంచి 8 లక్షల వరకు వెచ్చించి రైతుకు జీవిత భరోసా కల్పిస్తుందని అన్నారు. ఒక్కసారి బోరు వేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుని రైతు ఇబ్బంది పడకుండా ఆర్థిక భరోసా కలు గుతుందనే సదుద్దేశంతో సిఎం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 200 మంది రైతులకు జలకల ద్వారా లబ్ధి చేకూరందని, ఇంకా 300 రైతులకు లబ్ధి చేకూరాలని అతి త్వరలో మిగి లిన రైతుల కూడా లబ్ధి చేకూరేలా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిడి నందకుమార్‌రెడ్డి, ఎంపిపి వేంపల్లి నూర్జహాన్‌, జడ్‌పిటిసి పద్మజాలోకవర్ధన్‌, గుట్టపాలెం సర్పంచ్‌ రెడ్డివారి వెంకట్‌ రెడ్డి, నాయకులు మధురెడ్డి, మండల కన్వీనర్‌ చింతల రమేష్‌ రెడ్డి, మహేంద్రరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

➡️