సిఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సిఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి-కాకినాడసిఎం వైఎస్‌.జగన్‌ జనవరి 3న కాకినాడ రానున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు గురువారం పర్యవేక్షించారు. ఆర్‌ఎంసి గ్రౌండ్‌ ఆవరణను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. సిఎం పాల్గొనే బహిరంగ సభాస్థలి వద్ద చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఆ ప్రాంతంలో కార్పొరేషన్‌ పరంగా చేపట్టాల్సిన పారిశుధ్యం, ఇతర పనులపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ నాగ నరసింహారావు మాట్లాడుతూ పింఛన్‌ సొమ్మును 2,750 నుంచి రూ.3,000కు పెంపుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కాకినాడ నుంచి ప్రారంభిస్తారన్నారు. ముత్తా గోపాలకృష్ణ వారధి, రాగిరెడ్డి కళాక్షేత్రం, స్కేటింగ్‌ రింక్‌లను సిఎం ప్రారంభిస్తారన్నారు. కమిషనర్‌ వెంట నగరపాలక సంస్థ ఎస్‌ఇ పి.సత్య కుమారి, డిసిపి హరిదాస్‌, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పథ్వీచరణ్‌, ఉద్యాన సహాయ సంచాలకులు టివి.శిరిల్‌, ఇఇ మాధవి, శానిటరీ సూపర్‌వైజర్లు జిలానీ, రాంబాబు పాల్గొన్నారు.

➡️