సిఎం మారితే పథకాలు ఆగిపోతారు

ప్రజాశక్తి – వేపాడ : సిఎం మారిపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని అందుకే మరోసారి సిఎం జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని పాటూరులో బుధవారం జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డి. సత్యవంతుడు, వైసిపి మండల అధ్యక్షులు జగ్గుబాబు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎన్‌ వెంకటరావు, ఎఎంసి చైర్‌పర్సన్‌ ఎం. కస్తూరి, కోపరేటివ్‌ ప్రెసిడెంట్‌ రామునాయుడు, సోంపురం సర్పంచ్‌ గంగరాజు, నాయకులు దుల్లా మహేష్‌, గంగునాయుడు, ఎంపిడిఒ పట్నాయక్‌, ఇఒపిఆర్‌డి ఉమా, పంచాయతీ కార్యదర్శి సంధ్య, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సార థులు, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.బొబ్బిలి: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల 15వ సచివాలయం పరిధిలో బుధవారం ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి సంక్షేమం అందించాలంటే మళ్లీ జగనే సిఎం కావాలన్నారు. అనంతరం సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్‌ నాయుడు, పట్టణ జెసియస్‌ కన్వీనర్‌ రెజేటీ ఈశ్వర్‌ రావు (విస్సు), 4వ వార్డు కౌన్సిలర్‌ పందిరిపల్లి అమ్మనమ్మ, మున్సిపల్‌ మేనేజర్‌ శివ ప్రసాద్‌, రెవెన్యూ ఆఫీసర్‌ ప్రసాద్‌, టిపిఆర్‌ఒ జగన్మోహన్‌, సచివాలయం కన్వీనర్లు తూముల రాణి, కాసా వేణు గోపాల్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️