‘సిద్ధార్థ’ విద్యార్థినికి వెండి పతకం

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులోని సిద్ధార్థ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో వెండి పతకం లభించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు కడప జిల్లాలోని రైల్వే కోడూరులో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. అండర్‌ 17 మహిళా విభాగంలో జరగని పోటీలలో పాఠశాల 9వ తరగతి విద్యార్థిని గూడవల్లి తేజశ్రీ మళ్లీ ఈ వెండి పథకాన్ని సాధించటం గర్వకారణంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్‌ నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు విద్యార్థినిని దుశ్శాలువాతో సత్కరించి, ధ్రువీకరణ పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వి భారతి, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

➡️