సుపరిపాలన అందించాం..ఆశీర్వదించండి

ప్రజాశక్తి-మదనపల్లి సుపరిపాలన అందించామని, ఏ గ్రామానికి వెళ్లిన తమ ప్రభుత్వ అభివృద్ధి తెలుస్తుందని మరో సారి నన్ను ఆశీర్వదించండని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మో హన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి మదనపల్లి టిప్పు సుల్తాన్‌ మైదానంలో మేమంతా సిద్ధం సభ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని, అందుకే ప్రజల వద్దకు వెళ్లి తన పార్టీ అభ్యర్థులకు తనకు ఓటు వేసి గెలిపించి తనను మరోమారు ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ప్రతిపక్షాలు తనను విడివిడిగా ఎదుర్కొనలేక అందరూ కలిసి ఓటమిగా అధికారం కోసం గుంపులుగా జతకట్టి ప్రజలపైకి వస్తున్నారని వీరిని తరిమి కొట్టండని పిలుపునిచ్చారు. ఓటు అడిగే హక్కు చంద్రబాబు నాయుడుకు కూటమి అభ్యర్థులకు లేదని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తిగా తనపై బాబు, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలతో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారన్నారు. 58 నెలల పరిపాలన తర్వాత జరుగుతున్న యుద్ధానికి మనమంతా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఒక్క పథకం గుర్తురాని సిఎం చంద్రబాబుపేదలకు పెట్టుబడిదారులకు జరిగే కురుక్షేత్రంలో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్‌ స్థానాలు వైెసిపి కైవసం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 2019 చారిత్రత్మక తీర్పులో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చింది మన ప్రభుత్వమన్నారు. కులం మతం జాతి పార్టీ తేడా చూడకుండా అందరికీ సమానంగా తమ బిడ్డ సంక్షేమ పథకాలు మీ ఇంటకి చేర్చి ఉంటే తనను మరోమారు ఆశీర్వదించాలని కోరారు. అధికారం కోసం తోడేళ్లు గుంపులుగా మీ దగ్గరికి వస్తున్నాయని తెలిపారు. జెండాలు జతకడంతో పాటు తప్పుడు మేనిఫెస్టో మరో మారు మోసం చేయడానికి మూడు పార్టీలు ఏకమై తమ బిడ్డపై పోటీ పడుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలలో మంచి చేశామని అందుకే తమ అభ్యర్థులు స్వచ్ఛందంగా ఓట్లు అడిగే ధైర్యం సాహసం ప్రతి గడప ముందు ప్రజలు అందిస్తున్న సం తోషాలతో అక్క చెల్లెల దివ్యలతో ముందుకు సాగు తున్నారని తెలిపారు. చంద్రబాబు మళ్ళీ జిత్తుల మారి మాటలతో దత్తపుత్రుడు ఒకపక్కల బిజెపి పార్టీ మరోపక్కల కూటమిగా ఏర్పడి అరుంధతి సినిమాలోని పశుపతి లాగా అధికారం కోసం గర్జిస్తున్నారన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ముస్లిbఱలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింలు ఆర్థికంగా విద్యాపరంగా ముందుకు సాగనించాలని అప్పట్లోనే మైనార్టీల వైపు ఉన్న ప్రభుత్వమే మా ప్రభుత్వమన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి తిరిగి ఒక సూట్‌ కేస్‌ తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. కరోనాలో ఇతను ఎక్కడున్నాడో ఇక్కడి ప్రజలకు తెలియదని చెప్పారు. అలాంటివారు మరోసారి అధికారం కోసం 10 సంవత్సరాల తర్వాత ప్రజల ముందుకు రావడం గమన్నారమన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్‌అహ్మద్‌ మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుబిడ్డగా ప్రభుత్వ ఉద్యోగిగా తనకు ప్రజల పట్ల పూర్తి విశ్వాసం ఉందని అంతేకాకుండా ప్రజాసేవ చేసేందుకు కోసం తనకు మదనపల్లె అభ్యర్థిగా నియమించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ కిరణ్‌, ఎపిఎండిసి చైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లాం, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️