‘సురక్ష’ క్యాంపులు వినియోగించుకోండి

ప్రజాశక్తి-పిసిపల్లి: జగనన్న ఆరోగ్య సురక్ష ఇన్‌ఛార్జి ఎంపిడిఒ రమణారెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత షెడ్యూల్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ అత్యాల జఫన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదప్రజలు జబ్బుల వల్ల అప్పులపాలు కాకూడదని ఎంతో మంచి మనస్సుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. మండలంలోని ప్రజలందరూ మీ సచివాలయాల్లో జరుగు క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్యాంపు ద్వారా ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ముగ్గురు స్పెషల్‌ డాక్టర్లు వస్తున్నారు. కాబట్టి సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కార్డులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అత్యాల జఫన్య, ఇన్‌చార్జి ఎంపిడిఓ డి రమణారెడ్డి, డాక్టర్‌ యశ్శిత, ప్రద్యుష్‌ కిరణ్‌, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఉమాదేవి, డెర్మటాలజీ, పంచాయతీ నాయకులు మోహన్‌రెడ్డి, రవి, బాలనర్సిరెడ్డి, బొడే కొండారెడ్డి, కోటిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

➡️