సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం

టిడిపి అరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి సివేరి దొన్నుదొర

 

ప్రజాశక్తి -హుకుంపేట :మండలంలోని సంతారి, రాప, మత్య్సపురం, బోడపుట్టు పంచాయతీల్లో బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి అరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి సివేరి దొన్నుదొర మంగళవారం విస్తృతంగా పర్యటించారు. టిడిపి ఇన్‌ఛార్జిగా నియమితులైన తర్వాత తొలిసారి మండలానికి వచ్చిన దొన్నుదొరకు స్థానిక టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ముందుగా మండలకేంద్రంలోని మోదకొండమ్మను దర్శించుకున్నారు.అనంతరం సంతరి పంచాయతీ బిల్లాయిపుట్టు పర్యటించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. . వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని, టిడిపి, జనసేన అధికారంలోకి వస్తేనే గిరిజనులకు, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు తులసిరావు, జనసేన మండల అధ్యక్షులు బల్జే కోటేశ్వరరావు పద్మాపురం ఎంపిటిసి కిల్లో సాయిరాం, అరకు అసెంబ్లీ ఎస్‌టి సెల్‌ అధికార ప్రతినిధి పట్టిపోయిన శంకరనాయుడు, నాయకులు అన్నపూర్ణమ్మ, సుమతి, లకే నాగేశ్వరరావు, మాలయ్య, సివేరి ఈశ్వరరావు, వెంకటరమణ, త్రినాథ్‌, వైస్‌సర్పంచ్‌ దాసు పండన్న, అప్పలనాయుడు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

➡️