సెమీక్రిస్మస్‌ వేడుకలు

Dec 18,2023 19:49
పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
సెమీక్రిస్మస్‌ వేడుకలు
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో సెమీక్రిస్మస్‌ వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంఎల్‌ఎ డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు హాజరయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన 220 మంది పాస్టర్లకు ఇంటూరి నాగేశ్వరరావు దుస్తులు పంపిణీ చేశారు. తొలుత నేతలందరూ సెమీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్‌ కట్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో కందుకూరులో టిడిపి తరపున ఇంటూరి నాగేశ్వరరావు గెలవాలంటూ పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభువు ఏసుక్రీస్తు బోధించినట్లుగా ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలన్నారు. ఇంకా నూకసాని బాలాజీ, ఎరిక్షన్‌ బాబు మాట్లాడారు. క్రిస్టియన్‌ సోదరులు నాగేశ్వరరావు విజయానికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెవరెండ్‌ దేవ ప్రసన్న, టౌన్‌ చర్చ్‌ పాస్టర్‌ గడ్డం జాన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు వల్లేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, రాష్ట్ర సాంస్కతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల వెంకటరమణయ్య ఉన్నారు.

➡️