సైన్స్‌పై మరింత అవగాహన పెంపొందించుకోవాలి

Dec 15,2023 21:29

 ప్రజాశక్తి – కొమరాడ  :  విద్యార్థులు సైన్స్‌పై నిరంత అవగాహన పెంపొందించుకోవాలని ఎంఇఒ జామి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర గురుకుల పాఠశాలలో సదరన్‌ సైన్స్‌ ఫెయిర్‌ 2023 కార్యక్రమం నిర్వహించారు. దీనికి మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి వచ్చి వ్యక్తిగత, గ్రూపులుగా సైన్సు ఎగ్జిబిట్స్‌ తెచ్చి ప్రదర్శించారు. అనంతరం ఎంఇఒలు నారాయణస్వామి, తిరుపతిరావు, విక్రాంపురం, కోటిపాం ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు సైన్స్‌ ఫెయిర్‌ ఆవశ్యకతను వివరించారు. విద్యార్థులు తెచ్చిన ప్రాజెక్టులను వివరించి చక్కగా అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత వ్యక్తిగతంగా ఒక ప్రాజెక్టును గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థి లక్ష్మీ ప్రసాద్‌ గేర్‌ బాక్స్‌ సంబంధించి ప్రదర్శనను ఎంపిక చేశారు. గ్రూపు ప్రాజెక్టుకు దలైపేటకు చెందిన డి.గౌతమ్‌, జి.దుర్గాప్రసాద్‌ను జిల్లా సైన్స్‌ ఫెయిర్‌కు ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమం మండల సైన్సు కో-ఆర్డినేటర్‌ సిహెచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.మక్కువ: స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో మండల స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. సైన్స్‌ ఎగ్జిబిషన్లో మండలంలో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు వారు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి మండల అధ్యక్షులు మావుడి రంగునాయుడు హాజరయ్యి విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను పరిశీలించిచారు. మూడు ప్రాజెక్టులు ఎంపిక చేసి ఈనెల 23న పార్వతీపురం జరిగే ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో ఎంఇఒ పెంట సత్యనారాయణ, శ్యాంసుందరరావు, ప్రధానోపాధ్యాయులు హేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సీతానగరం : మండలంలోని మరిపువలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైజ్ఞానిక విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం ఎంఇఒ జి.సూర్యదేముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇటువంటి విజ్ఞాన తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను ఈ విజ్ఞాన ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైసిపి మండల నాయకులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.గరుగుబిల్లి : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఎంఇఒ ఎన్‌.నాగభూషణరావు తెలిపారు. స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన పాఠశాలలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయిలో జరగనున్న విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె.ప్రపూర్ణకుమారి, జె.సురేష్‌, గోవిందరావు, పక్కి రవీంద్ర, చంద్రమౌళి, సీఆర్పీలు బోను రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంఇఒలు డి.గౌరునాయుడు, ఆర్‌.ఆనందరావు ఆధ్వర్యంలో మండల స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని 10 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు కెజిబివి, గిరిజన ఆశ్రమం ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రదర్శనలో మూడు విభాగాల్లో 39 ప్రాజెక్టులు ప్రదర్శించినట్లు ఎంఇఒ తెలిపారు. ఈ ప్రదర్శనలో ఎంపికైన ప్రాజెక్టులు ఈనెల 23న జిల్లా స్థాయిలో జరగబోయే ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు. న్యాయ నిర్ణీతలుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.కుమారస్వామి, కత్తులకవిటి జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం పి.సుధారాణి, జిలక్ష్మణరావు, డిఎస్‌ఒ, ఎస్‌ సతీష్‌ పాల్గొన్నారు.

➡️