సై అంటున్న పందెం కోళ్లు..

Jan 14,2024 00:05
ఎన్నికల సంవత్సరం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సారి సంక్రాంతి కోడి పందేలకు చాలా ప్రాధాన్యత ఉంది. దాంతో అధికార పార్టీ పెద్దలు కోడి పందేలు చాటున పెద్ద ఎత్తున జూదాలకు తెరలేపనున్నారు. పేకాట, గుండాట ద్వారా భారీగా సొమ్ములు వెనుకేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల హెచ్చరికలు పక్కన పెట్టి పండుగ మూడు రోజులూ జూదాలు ఆడించేందుకు సిద్ధ పడ్డారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చిన్న, పెద్ద, భారీ బరులు ఏర్పాటయ్యాయి.సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడిపందాలు, జూదాల జాతరకు ఉమ్మడి జిల్లాలో రంగం సిద్ధమవుతుంది. ఆదివారం నుంచి ముహూర్తం ఖరారు కాబోతోంది. భోగి పండుగ నాడు పందాలకు తెరలేవనుంది. సంక్రాంతి మూడు రోజులు కోడి పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పలు మైదానాలను బరులుగా చేశారు. బరులు, పందెం శిబిరాల వద్ద మూడు రోజులపాటు గుండాట, పేకాట, మద్యం, బెల్టు షాపులు, సారా విక్రయాలు, బిర్యాణీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే వేలం పాటలు కూడా జరుగుతున్నాయి. రూ.లక్షల్లో పందేలు కాస్తున్న పందెం రాయుళ్లు ఉత్సాహంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా కోట్లలో సొమ్ములు కోడి పందేలు, జూదాలు ద్వారా చేతులు మారే అవకాశం కనిపిస్తోంది.తగ్గని పందెం రాయుళ్లుప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పందేలకు అనుమతులు వస్తాయనే ఆలోచనతో నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగమయ్యారు. కోడి పందేలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామనే హెచ్చరిక లతోపాటు బరులు ఏర్పాటు చేయకుండా ముందస్తు చర్య లు తీసుకుంటున్నా పందెం రాయుళ్లు వెనుకంజ వేయ డం లేదు. ప్రధానంగా కోనసీమ జిల్లాలో ముమ్మి డివరం, ఐ. పోలవరం, కాట్రే నికోన, అమలాపురం, అంబాజిపేట, ఆయి నవిల్లి, రాజోలు, మల్కిపురం, పి.గన ్నవరం, మామిడి కుదురు, కొత్తపేట, ఉప్పలగుప్తం, కపిలేశ్వరపురం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, తొండంగి, సీతానగరం, రాజానగరం తదితర మండలాల్లో పందేలు, జూదాలు యథేచ్ఛగా జరుగనున్నాయి.చేతులు మారనున్న రూ.500 కోట్లుగతేడాది పోలీసులు ఎన్ని ఆంక్షలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కోడిపందేలు ఆగలేదు. తొలుత కత్తుల్లేకుండా నిర్వహించి, ఆ తర్వాత భోగి పండగ నుంచి కోడి పుంజులకు కత్తులు కట్టి రక్తం చిందించారు. గత ఏడాది అధికార వైసిపి నేతలు నేరుగా పందేల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా భోగి రోజు నుంచి పందేలు ముమ్మరం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఈసారి అధికార పార్టీ నేతలు జూదాలపై ఫోకస్‌ పెట్టారు. పేకాట, గుండాటలకు వేలంపాటలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొందరిని ఆకట్టుకునేందుకు జూదాలకు అధికార పార్టీ నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు రూ.400 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలిసింది. ఈసారి రూ.500 కోట్లుపైనే చేతులు మారే అవకాశం కనిపిస్తోంది. మద్యం, సారా విక్రయాలకు ఏర్పాట్లు మరోవైపు పెద్ద ఎత్తున మద్యం విక్రయాలకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. జగన్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం విక్రయాలను జరుపుతూ ఆదాయమే ప్రధానంగా ప్రభుత్వం బెల్ట్‌ షాపులను సైతం ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సారి సంక్రాంతిలో మద్యం విక్రయాలు జోరుగా సాగనున్నాయి. గుడుంబా విక్రయాలను కూడా జరిపేందుకు కొందరు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కోనసీమ, ఏజెన్సీ ప్రాంతాల్లో సారా జోరు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం అధిక విక్రయాలు, సారా నియంత్రణకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్ధకం.

➡️