సొంత సొమ్ముతో స్కాలర్షిప్‌లు పంపిణీ

ప్రజాశక్తి – భోగాపురం : విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్‌లను అందజేస్తున్నామని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్‌ లోకం మాధవి అన్నారు. భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు రూ. 2.61లక్షల తమ సొంత నిధుల నుంచి ఆమె విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అలాంటి వారి కోసం ఏటా స్కాలర్‌షిప్‌లను తమ వంతు సహాయంగా అందజేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. పూసపాటిరేగ జనసేన నాయకుడు కొలా శ్రీను ప్రమాదవశాత్తు తన కాళ్లు పోగొట్టుకున్న సందర్భంగా ఆయనకు ఇటీవల పార్టీ నుంచి మూడు లక్షల చెక్కు అందజేశారు. కాగా ఆదివారం ఆయనకు ఆర్టిఫిషియల్‌ కాలు పెట్టించుకునేందుకు ఆమె మరో రూ.15 వేలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పళ్ళ రాంబాబు, పల్లంట్ల జగదీష్‌, పిడుగు జోగారావు, వడ్డ గిరిబాబు, వాసుపల్లి రాము, నీలాద్రి ఈశ్వరరావు, మాత నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. అప్పన్నపేటలో జనసేన నాయకుల పర్యటనమండలంలోని భోగాపురం పంచాయతీ అప్పన్నపేట గ్రామంలో జనసేన నాయకులు ఆదివారం పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను వారికి వివరించారు. లోకం మాధవిని గెలిపించేందుకు మీరంతా సహకరించాలని వారికి విన్నవించారు. గ్రామంలోని ఒక ఇంటి వద్ద కుళాయి కాలువలో ఉండడంతో తాగునీరు కలుషితం అవుతుందని గుర్తించారు. పంచాయతీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పళ్ళ రాంబాబు, పల్లంట్ల జగదీష్‌, సిరుగుడు వెంకటేష్‌ పాల్గొన్నారు.రైతులకు పనిముట్లు పంపిణీనెల్లిమర్ల: మండలంలోని జగ్గరాజుపేటలో ఆదివారం రాత్రి మన ఊరిలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన నియోజకవర్గం ఇంఛార్జి లోకం మాధవి చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు దినోత్సవాన్ని పురష్కరించుకుని నాలుగు మండలాల రైతులకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

➡️