సోమశేఖర్‌రెడ్డి సేవలు మరువలేనివి

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కె.సోమశేఖరరెడ్డి విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దారని యుటిఎఫ్‌ నేతలు కొనియాడారు. ఫిజికల్‌ డైరెక్టర్‌ సోమశేఖరరెడ్డి కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఈ సందర్భంగా స్థానిక జడ్‌పి బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం సంతాప సభ నిర్వహించారు. సభకు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సోమశేఖరరెడ్డి అందించిన సేవలు మరువలేమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఒద్దుల వీరారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆటలో రాణించేలా శిక్షణ ఇవ్వడంలో కె.సోమశేఖరరెడ్డి దిట్ట అని కొనియాడారు. యుటిఎఫ్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎ.శేష యోగయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి యుటిఎఫ్‌ కుటుంబ సంక్షేమ సహకారం అందిస్తుందన్నారు. అనంతరం యుటిఎఫ్‌ కటుంబ సంక్షేమ నిధి నుంచి రూ. 1,50,000 చెక్కును సోమశేఖరరెడ్డి సతీమణి కె.వసుంధరకు అందజేశారు.

➡️