స్కానింగ్‌ సెంటర్లలో ఆకస్మిక తనిఖీ

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ పట్టణంలోని స్కానింగ్‌ సెంటర్లను అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శైలజ తనిఖీ చేశారు. ప్రతి ఒక స్కానింగ్‌ సెంటర్లో రికార్డులను పరిశీలించి తగిన సూచన సలహాలు ఇచ్చారు. స్కానింగ్‌ సెంటర్‌కు వచ్చిన ప్రజలకు ఇస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు అనుగుణంగా స్కానింగ్‌ నిర్వహిస్తున్నారో లేదో అని పరిశీలించి అక్కడి డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్నారు. చట్ట విరుద్ధమైన స్కానింగ్‌ నిర్వహించి ఫలితాలు తెలిపితే అటువంటి స్కానింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️