స్టడీ మెటీరియల్‌ అందజేత

Jan 3,2024 00:21

ప్రజాశక్తి-పిసిపల్లి : విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అంద జేయడం అభినందనీ యమని సర్పంచి పోలం లక్ష్మీదేవి, ప్రధానోపా ధ్యాయుడు షేక్‌ అబ్దుల్‌ సుభాన్‌ తెలిపారు. స్వయంకషి సేవ సంస్థ అధ్యక్షుడు షేక్‌ నాయబ్‌రసూల్‌ సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ను పెదఇర్లపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళ వారం అందజేశారు. ఈ సందర్బంగా స్వయంకషి సేవా సంస్థ అధ్యక్షుడు షేక్‌ నాయబ్‌ రసూల్‌ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనం తరం విద్యాబివృద్ధికి, మరియు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయబ్‌ రసూల్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్‌ సూరా మాల్యాద్రి, ఎంపిటిసి ఎం. కొండయ్య, స్వయంకషి సేవా సంస్థ సభ్యుడు గోదా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు లంకిరెడ్డి జానకి రామిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️