హడ్డుబంగిలో భవిష్యత్తు గ్యారంటీ

Jan 11,2024 21:30

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ”బాబు షఉరిటీ -భవిష్యత్తు గ్యారంటీ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయకష్ణ మినీ మేనిఫేస్టో లోని సూపర్‌ సిక్స్‌ అంశాలును వివరిస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునాయుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన సక్రమార్గంలో ఉండాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ రావాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, బీసీ సెల్‌ అధ్యక్షులు ఆర్‌.రంగనాధం, సర్పంచ్‌ బిడ్డిక నీలయ్య, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు గంట సుధ, మాజీ సర్పంచ్‌ బిడ్డిక ఆనందరావు, మూటక భరత్‌ రాజ్‌, మండంగి కుమార్‌, బిడ్డిక విశ్వనాధం, బిడ్డిక ప్రవీణ్‌ సాయి, పువ్వుల భాస్కరరావు, బిడ్డిక ఉమాకాంత్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️