హనిమిరెడ్డికి ఘన స్వాగతం

ప్రజాశక్తి – పంగులూరు : పల్లెపల్లెకు హనిమిరెడ్డి అనే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆరికట్లవారి పాలెం గ్రామంలో వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పానెం హనిమిరెడ్డి ఆదివారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకుల, గ్రామస్తులు ఆయన ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చుకుంటూ , డప్పు వాయిద్యాలతో గ్రామంలోకి తీసుకువెళ్లారు. తొలుత దళితవాడలో హనిమిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేస్తేనే పేదల బతుకులు మారుతాయన్నారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలకు అండగా నిలిచిన జగన్మోహన్‌ రెడ్డిని పేదలంతా ఆశీర్వదించాలన్నారు.తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, తాను అద్దంకి ప్రజల ఆదరాభిమానాలను మరిచిపోనని, పజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు స్వయంపు హనుమంతరావు, గ్రామ సర్పంచి స్వయంభు సురేష్‌, వైసిపి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు జంపని రవిబాబు, ముప్పవరం సర్పంచి రౌతు సాంబశివరావు, నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు, బొడ్డు రాజేష్‌, ముప్పవరం ఎంపిటిసి గంగాధర్‌, వైసిపి రైతు సంఘం అధ్యక్షుడు తోట రామాంజనేయులు, శంకర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️