హాకీ జిల్లా బాలుర జట్టు ఎంపిక

ప్రజాశక్తి-సంతనూతలపాడు: హాకీ ప్రకాశం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జూనియర్‌ బాలుర హాకీ జట్టు ఎంపికలు ఒంగోలులోని డిఆర్‌ఆర్‌ ఎంఎం హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 40 మంది పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ గల క్రీడాకారుల్ని జిల్లా హాకీ జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన హాకీ జట్టు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని కార్యదర్శి సుందరరామిరెడ్డి తెలిపారు. జిల్లా జట్టు ఎంపికను అసోసియేషన్‌ సభ్యులు ఎస్‌ చంద్రశేఖర్‌, టి రవికుమార్‌ (హాకీ రవి), పి రవి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీలు చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు, పీఈటి వెంకట్రావు పాల్గొన్నారు.

➡️