హుదూద్‌ ఇళ్లు అప్పగించాలని ధర్నా

Feb 20,2024 20:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: పట్టాలిచ్చిన వారికి హుదూద్‌ ఇళ్లుఅప్పగించాలని కోరుతూ మంగళవారం హౌసింగ్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ 2014లో హుదూద్‌ తుపాను వల్ల ఇళ్లు కోల్పోయిన పేదలకు 2019 లంకాపట్నం వద్ధ 432 మందికి ఇళ్లునిర్మించి పట్టాలిచ్చారని, కానీ నేటివరకు కరెంటు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు. దీంతో అక్కడ నివాసం ఉంటున్న వారికి మౌళికసదుపాయాలు లేక నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. కావున తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని , లబ్దిదారులకు అధికారికంగా ఇళ్లు అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం హౌసింగ్‌ డిఇకి వినతి అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి.రమణమ్మ. జగదాంబ, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️