100 పడకలతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

Feb 25,2024 23:49

ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకస్థాపన చేసిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ శిలాఫలకం, పాల్గొన్న వైద్య బృందం
ప్రజాశక్తి-తెనాలి : స్థానిక జిల్లా వైద్యశాలలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణానికి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోది వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ 100 పడకలతో రూపుదిద్దుకోనున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌తో ఎంతో ప్రయోజనం ఉంటుందని, ముఖ్యంగా యాక్సిడెంట్‌ కేసులకు మంచి వైద్యం అందుతుందని అన్నారు. రూ.5 కోట్ల అంచనాతో యూనిట్‌ నిర్మాణం జరుగనుందని, దానిలో రూ.14 కోట్లతో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయని, దాదాపు 15 నెలల్లో నిర్మాణం కూడా పూర్తి కావొచ్చని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం టీమ్‌ డాక్టర్‌ మన్మోహన్‌ డాక్టర్‌ శ్రావణ్‌బాబు, ఏపిఎంఎస్‌ఐడిసి డీఈఈ కె.వెంకటరత్తయ్య, జిల్లా ఉపవైధ్యాధికారిణి డాక్టర్‌ ఇ.అన్నపూర్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌సాభాగ్యవాణి, ఏవో ఎం.మజిదాబి, డాక్టర్స్‌ శ్రీకాంత్‌, వినీల్‌, మంజూష, మానస, సీనియర్‌ సహాయకులు వై.కవిత పాల్గొన్నారు.

➡️