100 లీటర్ల సారా స్వాధీనం – ఇద్దరు అరెస్టు

కాకినాడ : పాత పెద్దాపురంలో 100 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ సిబ్బంది కలిసి స్థానిక పాత పెద్దాపురంలోని సారాయి స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. కోమలి రాజు, కోమలి యేసు రత్నం లను అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. నాటు సారాను కొందరు సరఫరా చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాటు సారా తయారీ, అమ్మడం, రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️