11 నుంచి పంట నష్టంపై సర్వే

11 నుంచి పంట నష్టంపై సర్వే

ప్రజాశక్తి – పెద్దాపురంతుపాను, వర్షాల కారణంగా పెద్దాపురం మండల పరిధిలో జరిగిన పంట నష్టాలపై ఈ నెల 11 నుండి సర్వే నిర్వహిస్తామని ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఎన్‌.మల్లికార్జునరావు తెలిపారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు పెద్దాపురం మండల పరిధిలో పంట నష్టపోయిన కర్రపెండలం దుంప,అరటి తోటలను, పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులు తమ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని పంట నష్టం వివరాలు సిబ్బందికి అందజేయాలన్నారు. గ్రామాల వారీగా పంట నష్టం పరిశీలన బృందాలను ఏర్పాటు చేసి ఈ నెల 11వ తేదీ నుంచి పరిశీలన జరుపుతారన్నారు. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వివరాలు నమోదు చేస్తారన్నారు. శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.జానకి, సుజాత, బిహెచ్‌ఎలు సత్తిబాబు, సత్యనారాయణ, జ్యోతి, బిహెచ్‌ఎలు విష్ణు, జెస్సికా, అమృత, విఆర్‌ఒ బంగారమ్మ పాల్గొన్నారు.

➡️