112 లీటర్ల పురుగు మందులు సీజ్‌

Mar 27,2024 22:54

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోని శ్రీవెంకట తిరుమల ఫర్టిలైజర్స్‌ ఎరువుల దుకాణంలో గుంటూరు రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంఠ్‌ ఎస్సీ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. రెండు కంపెనీలకు చెందిన ఏడు రకాల ఎరువులు పురుగు మందులకు సంబంధించి ప్రిన్సిపల్‌ సర్టిఫికెట్స్‌ లేకపోవడంతో రూ.4.43 లక్షల విలువైన 112 లీటర్ల పురుగు మందులను సీజ్‌ చేశారు. విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వ్యవసాయ అధికారి కె.రమణ కుమార్‌ అనుమతులు లేని ఎరువులు పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఎస్‌ఐ ఎన్‌.రామ చంద్రయ్య, వ్యవసాయ శాఖ ఎడిఎ పి.మస్తానమ్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️