125మందికి ఉచిత వైద్యసేవలు

రైజ్‌ హాస్పిటల్‌

ప్రజాశక్తి- గాజువాక :ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెదగంట్యాడ శ్రీ సాయిరాం క్లినిక్‌లో రైజ్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. 125 మంది రోగులకు వైద్యపరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైజ్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ అవినాష్‌ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో, ప్రతినెలా ఏదో ఒకరోజున తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించి, రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని, భవిష్యత్‌లో కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున దోమలు విజృంభించి, జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలంతా తగు ఆరోగ్యజాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్‌ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ నళిని, డాక్టర్‌ మీనాక్షి, గ్రామీణ వైద్యులు అను, నాయక్‌, గంగాభారు, కౌసల్య భవాని, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్‌ అవినాష్‌

➡️