13వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-యంత్రాంగం

డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు నిరసన తెలిపారు.మండపేట కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆది వారానికి 13 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ నిరంకురశ వైఖరికి తగిన మూల్యం తప్పక చెల్లించుకుంటుందన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న సిఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం దిగచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ బేబీ, ఆదిలక్ష్మి, సిహెచ్‌.రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల, సత్యవేణి, పద్మ, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం. అంగన్‌వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్ల్‌ కోసం 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గపు చర్యగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఆవరణ లో ప్రాజెక్టు పరిధిలో అంగన్‌ వాడి వర్కర్ల నిరసన దీక్షలకు ఆదివారం దుర్గా ప్రసాద్‌ సంఘీభావంగా దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిరసన శిబిరం నుండి కాశి వాని తూము సెంటర్‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాడి తీరుతాం – సాధించి తీరుతాం అంటూ అంగన్‌వాడీలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కెవివి.సుబ్బలక్ష్మి, వి.యశోద దేవి, ఎం.విజయలక్ష్మి, వి.సత్యవతి, ఎస్‌.కనక దుర్గా, బి.నాగరత్నం, అనంత రమాదేవి, మల్లీశ్వరి, విజయకుమారి, జి.మంగాయమ్మలతో పాటు అంగన్‌ వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.

 

➡️