16న గ్రామీణ భారత్‌బంద్‌

Feb 14,2024 22:26
ఫొటో : మాట్లాడుతున్న నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న నాయకులు
16న గ్రామీణ భారత్‌బంద్‌
– విజయవంతానికి సిఐటియు, కౌలు రైతుసంఘం, రైతు సంఘాల పిలుపు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : కార్మిక, కర్షక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం 16వ తేదీ శుక్రవారం చేపడుతున్న గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఆత్మకూరు సిఐటియు, రైతుసంఘం, కౌలు రైతుసంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని చెర్లో రమణారెడ్డి భవన్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం నుండి రైతులను బయటకు నెట్టివేసి దాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు, కార్మికుల, ఉద్యోగుల శ్రమను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు బిజెపి ప్రభుత్వం చట్టాలు చేస్తుందని విమర్శించారు. ఆ మేరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ పలు డిమాండ్ల సాధనకు గ్రామీణ భారత్‌ బంద్‌ను నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్ఛా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చినట్లు తెలియజేశారు. 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్‌టిసి బస్టాండ్‌ నుండి ర్యాలీ బయల్దేరుతుందన్నారు. కార్యక్రమానికి రైతులు, కార్మికులు ప్రజాతంత్రవాదులు, రైతు సంఘాలు, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆత్మకూరు నాగయ్య, కొండమూరి హజరత్తయ్య, జిల్లా కౌలురైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, ఎపి రైతుసంఘం అధ్యక్ష కార్యదర్శులు, లక్కు కృష్ణ ప్రసాద్‌, కృష్ణమోహన్‌, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.రైతులతో రైతుసంఘాలు సమావేశం :గ్రామీణ భారత్‌ బంద్‌ను విజయవంతం చేయడానికి ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లె గ్రామ రైతులతో రైతుసంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం నాయకులు రైతులతో మాట్లాడుతూ 16వ తేదీ జరగబోయే దేశవ్యాప్త బంద్‌ గురించి దాని ప్రాముఖ్యత ఢిల్లీలో జరిగే రైతాంగ ఉద్యమం ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌, వ్యవసాయ మోటార్లకు మీటర్లు తదితర అంశాలపై రైతులకు కూలంకుషంగా వివరించారు.

➡️