16న గ్రామీణ భారత్‌ బంద్‌

Feb 14,2024 22:01
ఫొటో : మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు
16న గ్రామీణ భారత్‌ బంద్‌
– జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల పిలుపు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : 16వ తేదీన జరిగే గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సిపిఎం ఆఫీసులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పసుపులేటి పంచలయ్య, సిపిఐ నాయకులు కె నరసింహారావు, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు ఎల్‌ లక్ష్మిరెడ్డి, సిపిఐ ఎల్‌ఎం న్యూ డెమోక్రసీ నాయకులు కె.భాస్కర్‌ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వరంగ సమస్యలను ప్రయివేటీకరణ చేస్తూ ఇబ్బందికరమైన నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకొచ్చిందని, కార్మిక చట్టాలను కుదించిందని వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తుందని కార్మికుల, ఉద్యోగుల శ్రమను దోచుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా పెరిగిన ధరలతో ప్రజలు కొని తినలేక అల్లాడిపోతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం పెరిగిన ధరలు తగ్గించడంలో విఫలమైందని, రైతులకు, ఇళ్లకు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లను బిగించి ప్రజల వద్ద నుంచి దోచుకోవాలని చూస్తుందని విమర్శించారు. ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఈ విధానాలపై 16న జరిగే గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మెలో అన్ని రంగాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకులు ఎల్‌ శ్యామల, సిఐటియు నాయకులు బి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️