16న సైన్స్‌ ఫెయిర్‌

ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 16న మండల స్థాయిలో సైన్స్‌ ఫెయిర్‌(విద్యా వైజ్ఞానిక ప్రదర్శన) నిర్వహిస్తున్నట్లు ఎంఇఒలు ఎస్‌.వెంకటేశ్వర్లు, కె.శివాజీ తెలిపారు. స్థానిక ఎంఆర్‌సిలో ప్రధానో పాధ్యాయులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒలు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు సైన్స్‌ ఫెయిర్‌లో పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల అవగాహన పెంచేలా, సృజనాత్మకత పెంపొందేలా ప్రోత్సహించేయందుకు రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్లు టిఎల్‌. కాంతారావు, బండి శ్రీనివాసరావు, రాంబాబు, డి. నాగయ్య ,ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️