18 రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

18 రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-కాకినాడసమగ్ర శిక్ష ఉద్యోగులు తలపెట్టిన సమ్మె శనివారం 18వ రోజుకి చేరుకుంది. ఎస్‌పిడి కార్యాలయం ముట్టడి సందర్భంగా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సమ్మెను మరింత ఉధతం చేయడం మినహా ఉద్యోగులకు మరొక మార్గం లేదని, ఇచ్చే జీతాలు కుటుంబాల్ని పోషించుకునేందుకు ఏమాత్రం సరిపోవడం లేదని, తక్షణం జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్షలో పని చేసే ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని, కేంద్ర పథకాలలో అమలు జరుగుతున్నట్టుగా మినిమం టైమ్‌ స్కేల్‌, హెచ్‌ఆర్‌ పాలసీ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జెఎసి జిల్లా అధ్యక్ష కార్యదర్సులు ఎం.చంటిబాబు, సత్యనాగమణి, ఉపాధ్యక్షులు ఎంవి.సాయికిరణ్‌, ఎ.లోవరాజు, పివివి.మహాలక్ష్మి, ఎం.రాధాకృష్ణ, సహాయ కార్యదర్సులు కె.చంద్రశేఖర్‌, జి.నారాయణ, ఎంబి.సాల్మన్‌, జిల్లా కోశాధికారి పి.రాజు, కె.శ్రీనివాస్‌, ఎం.గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️