22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

Jan 19,2024 23:43
ఈ నెల 22వ తేదీన తుది

ప్రజాశక్తి – కాకినాడ

ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కాకినా డ కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా వివిధ నియోజకవర్గాల ఇఆర్‌ఒలతో కలిసి పాలొ ్గన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024, ఓటర్ల తుది జాబితా ప్రచురణ, ఎన్నికల సిబ్బంది డేటా బేస్‌, ఆర్‌ఒ, ఎఆర్‌ఒలకు శిక్షణ, పోలింగ్‌ కేంద్రా ల్లో కనీస సౌకర్యాలు కల్పన, జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ఇఆర్‌ఒలతో మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ఎన్నికల సిబ్బందిగా విధుల నిర్వహణకు అవసరమయ్యే ఉద్యోగుల డేటాబేస్‌ రూప కల్పనను పూర్తిచేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ఒ, ఎఆర్‌ఒల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో జిల్లాలో బూత్‌ స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ, డిఆర్‌డిఎ పీడీ కె శ్రీరమణి, పెద్దాపురం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, కాకినాడ అర్బన్‌, పిఠాపురం తహశీల్దార్లు పివి.సీతాపతిరావు, పి.త్రీనాథ్‌రావు, ఎన్నికల డిటి ఎం.జగన్నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️