23 నుంచి 104, 108 ఉద్యోగుల సమ్మె

Jan 9,2024 23:45
తమ న్యాయమైన

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో చూపు తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పలు ఉద్యో గ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమస్యలపై సమరం సాగిస్తున్నాయి. ఇప్పటికే అంగన్‌ వాడీలు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు, మున్సిపల్‌ వర్కర్లు సమ్మె చేస్తుండగా అదే బాటలో 104, 108 సిబ్బంది సమ్మెకు సన్నద్ధమ వుతున్నారు. ఏళ్లు తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23 నుంచి ఉమ్మడిగా సమ్మెకు దిగను న్నట్లు ఆయా యూని యన్లు ఇప్పటికే ప్రకటిం చాయి. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులకు సమ్మె నోటీసులు కూడా అందజేశారు.ఏళ్లు తరబడి 104,108 ఉద్యోగుల సేవలుఅనేక సంవత్సరాలుగా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న 104, 108 ఉద్యోగులను 2019లో సిఎం జగన్‌తో జరిగిన చర్చల్లో అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్లో చేరుస్తా మని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా నేటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకాల్లో గతంలో 108 ఉద్యోగులకు వెయిటేజిని కూడా ఇచ్చారు. కానీ వైసిపి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో డిఎంఇలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియా మకాలు చేపడుతున్నారు. అయితే ఎలాంటి పోస్టుల నోటిఫికేషన్లో ఉన్న విద్యా అర్హతలు లేని కారణంగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యం లో వాటిని సవరించి 108లో ఇఎంటీలుగా పనిచేస్తున్న వారి సర్వీసున పరిగణలోకి తీసుకుని అవ కాశం కల్పించాలని కోరుతున్నా పట్టించు కోవడం లేదు. ఈ తరుణంలోనే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ద పడుతున్నారు. ఈ నెల 22 తేదీలోపు సమస్య లను పరిష్కరించకపోతే 23 నుంచే విధులను బహిష్కరించి సమ్మెకు దిగనున్నట్లు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. క్షతగాత్రుల అత్యవసర పరిస్థితులను, ఉద్యోగులు అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరుతున్నారు.

➡️