కోట పంచాయతీ పరిధిలో 23 మంది వాలంటీర్లు రాజీనామా

Apr 4,2024 16:45 #Tirupati district

ప్రజాశక్తి -కోట : కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని మూడు సచివాలయాలకు చెందిన 23 మంది గ్రామ వాలంటీర్లు వారి విధులకు స్వచ్ఛందంగా రాజీనామ చేయడం జరిగింది.ఈ సందర్బంగా గురువారం వారి రాజీనామ లేఖలను కోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకరయ్య కు అందించారు.ఈ మేరకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయవద్దని ఎన్నికల విధుల నుండి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.దీంతో వాలంటీర్లు రోజురోజుకు మూకుమ్మడి రాజీనామాలు సిద్ధపడుతున్నారు. అనంతరం పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా లబ్దిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందజేసి,నిస్వార్థ సేవలు చేశామని,ఎలాంటి రాజకీయాలకు ప్రభావితం కాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు.అయితే కొంత మంది ప్రతిపక్ష నాయకులు వాలంటీర్ల సేవలను రాజకీయ దృష్టితో చూస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు.దీంతో ఈసీ తాత్కాలికంగా వాలంటీర్లను సంక్షేమ పథకాలు ప్రజలకు అందించకుండా ఆదేశాలు ఇచ్చిందన్నారు.ఈ చర్యలతో తామంతా మనస్థాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు వాపోయారు. తెలుగుదేశం పార్టీ వారు తమ సేవలను గుర్తించకుండా వారిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ బాధపడుతున్నారని వారు వాపోయారు.ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనం కోసం కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సేవా దృక్పథంతో తాము పని చేస్తున్నామని అన్నారు.ఎన్నికల కోడ్‌ పేరుతో తమను తమ విధులకు దూరం పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు.

➡️