ఆడుదాం ఆంధ్రా కిట్ల పంపిణీ

కిట్లు పంపిణీ చేస్తున్న మంత్రి వేణు

ప్రజాశక్తి-రామచంద్రపురం

ఆటాడుదాం ఆంధ్ర కిట్లును రాష్ట్ర మంత్రి చెళ్లుబోయిన వేణు గోపాల కష్ణ సోమవారం పంపిణీ చేశారు. కె.గంగవరం మండలం లో ఆడుదాం ఆంధ్రాలో చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించి అమలు జరుగుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేవిధంగా కషి చేయాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఆయా విభాగాల కిట్లు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి పంప నాగమణి, సర్పంచ్‌ పిల్లి రాంబాబు, దంగేరు సర్పంచ్‌ కొప్పిశెట్టి వెంకటరమణ, అద్దంపల్లి సర్పంచ్‌ చింతపల్లి లక్ష్మి, వైస్‌ ఎంపిపి దూడల నాగేశ్వరరావు, చింతపల్లి వాసు స్థానిక ప్రజాప్రతినిధులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️