26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

జివిఎంసి కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు

ప్రజాశక్తి- ములగాడ : తమ సమస్యల పరిష్కారానికి జివిఎంసి కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు ఈనెల 26నుంచి సమ్మెబాట పట్టనున్నారని ఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.నూకరాజు వెల్లడించారు. శనివారం మల్కాపురం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జనరల్‌ బాడీ సమావేశంలో మాట్లాడుతూ విపక్ష నేతగా పాదయాత్రలో, ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని, కనీస వేతనం అమలు చేస్తానని హామీఇచ్చి, నాలుగున్నరేళ్లు గడిచినా నేటికీ అమలు చేయలేదన్నాఉ. సుప్రీంతీర్పును గౌరవించి సమానపనికి సమాన వేతనం, క్లాబ్‌ డ్రైవర్లకు రూ.18,500 కనీసవేతనం చెల్లింపు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ అధ్యక్షుడు కె. రమణ అధ్యక్షత వహించిన సమావేశంలో సిఐటియు మల్కాపురం జోన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి సిఐటియు జోన్‌ అధ్యక్షులు పెంటారావు, బి.రాంబాబు, డి.రాము, బి.సూరిబాబు, రైల్‌ బాబు, ఆదినాయణ, కృష్ణ, తిరుపతిరావు, ఎన్‌.ఉమ, పాప,ప్రభ ,లక్ష్మి, అప్పలకొండ, మీనా, రవణమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సిఐటియు నేత నూకరాజు

➡️