నాలుగో రోజు 30 నామినేషన్లు

Apr 22,2024 22:31

 విజయనగరం జిల్లాలో లోక్‌సభకు-3 , అసెంబ్లీకి 18

మన్యంలో అరకు స్థానానికి 5, అసెంబ్లీ స్థానాలకు 4

ప్రజాశక్తి-విజయనగరం కోట/పార్వతీపురం :  ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు పార్లమెంట్‌, 11 అసెంబ్లీ స్థానాలకు నాలుగో రోజు సోమవారం మొత్తంగా 30 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం పార్లమెంటు స్థానానికి ముగ్గురు, అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 18 మంది నామినేషన్లను దాఖలు చేశారు. విజయనగరం ఎంపి స్థానానికి వైసిపి అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేశారు. నియోజకవర్గ ఆర్‌ఒ జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఐదుగురు నామినేషన్‌ వేశారు. వారిలో బిజెపి అభ్యర్ధిగా కొత్తపల్లి గీత ఉన్నారు. విజయనగరం ఎంపి స్థానానికి వైసిపి అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేశారు. ఆయన నియోజకవర్గ ఆర్‌ఒ జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అదే పార్టీ తరపున బెల్లాన వంశీకృష్ణ కూడా రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా సియ్యాదుల ఎల్లారావు నామినేషన్‌ వేశారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి విజయనగరం నియోజకవర్గంలో అఖిల భారతీయ జనసంఫ్‌ు పార్టీ తరపున పోలిపల్లి కిరణ్‌కుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ తరపున పెనుమత్స కరుణాకర్‌, స్వతంత్ర అభ్యర్థిగా పడాల ఆదినారాయణ నామినేషన్‌ వేశారు. గజపతిగరంలో స్వతంత్ర అభ్యర్థిగా జి.కూర్మినాయుడు, నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి కె.గౌరినాయుడు నామినేషన్‌ వేశారు. ఎస్‌.కోట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధులుగా వారాది చిరంజీవి, కొట్యాడ లోకాభిరామకోటి, కొట్యాడ రమాదేవి, భాస్కరభట్ల పుష్పలత, వైసిపి తరపున బి.అప్పలనాయుడు నామనేషన్లు వేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో బిఎస్‌పి అభ్యర్థిగా ఎరుకొండ తేజారాణి, రీఫార్మ్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున అదపాక సూరిబాబు, సమాజ్‌వాదీ తరపున కర్రి చిన్నారి, అదే పార్టీ తరపున కర్రి కృష్ణ, జనసేన పార్టీ తరపున లోకం నాగమాధవి నామినేషన్‌ వేశారు.రాజాం నియోజకవర్గంలో బిఎస్‌పి నుంచి బొచ్చ బుద్దుడు, బొబ్బిలి నియోజకవర్గంలో టిడిపి తరపున వికెఎస్‌ కష్ణ రంగారావు(బేబినాయన), కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్‌ నామినేషన్‌ పత్రాలను నియోజకవర్గ ఆర్‌ఒలకు అందజేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

పార్వతీపురం మన్యంలో…

పార్వతీపురం మన్యంజిల్లాలో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి బిజెపి అభ్యర్ధిగా కొత్తపల్లి గీత నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సమర్ధి భవాని, బిఎస్‌పి అభ్యర్థిగా వరం ఆవశ్య లహరి, కంగల బాలుదొర, జిడిపి పార్టీ అభ్యర్థిగా బిడ్డిక రామారావు తమ నామినేషన్‌ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌కు అందజేశారు.మఇక పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కుప్పిలి వెంకట రమణ బహుజన సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి కె.హేమలత కు సమర్పించారు. కురుపాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌్‌జెండర్‌ అడ్డాకుల గీతారాణి, కురుపాం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా తోయిక జగదీశ్వరి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వివి రమణకు దాఖలు చేశారు. పాలకొండ నియోజక వర్గం నుండి గోండ్వానా దండకారణ్య పార్టీ అభ్యర్థిగా బిడ్డిక ఉమామహేశ్వరరావు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి కల్పనా కుమారికి సమర్పించారు. సాలూరు శాసన సభ నియోజక వర్గంలో నామినేషన్లు దాఖలు కాలేదు .బిజెపి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆస్తులుఅరకు బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత తనపేరు, తన భర్త పేరున స్థిర, చరాస్తులు కలిపి మొత్తంగా 16కోట్ల 71లక్షల 66, 953గా అఫిడవిట్‌లోపేర్కొన్నారు. అలాగే ఇద్దరి పేరున రూ.11కోట్ల 76లక్షల 54వేల 232 అప్పు ఉన్నట్లు చూపించారు. గీత వద్ద 2కోట్ల 87లక్షల 77వేల 247 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, ఆమె భర్త పరుచూరి రామ కోటేశ్వరరావు వద్ద 6కోట్ల 86లక్షల 89వేల 706 రూపాయల విలువైన ఆభరణాలు వున్నాయి. అలాగే ఆమెపై 420,120బి,468,471 ఐపిసి సెక్షన్‌ కింద కేసులు నమోదయ్యాయి. హైదారాబాద్‌ సిబిఐ కోర్టులో ఈ కేసులున్నాయి. ఛీటింగ్‌, క్రిమినల్‌ కాన్సిపిరసీ, ఫోర్జరీ, ఫోర్జరీ డాక్యుమెంట్‌ వినియోగం నేరాలపై కేసులు నమోదయ్యాయి. వీటిపై 2022 సెప్టెంబర్‌ 13న ఐదేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు పై ఉన్నత స్థానం స్టే విధించింది.ఇప్పటికీ రెండు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి.చరాస్తి 2కోట్ల 87లక్షలు 77వేల 247ఆయన పేరున 6కోట్ల 86లక్షల 89వేల 706స్థిరాస్తి గీత పేరున 6కోట్ల 97లక్షలుమొత్తంగా 16కోట్ల 71లక్షల 66, 953 ఉంది. అప్పు : గీత 5కోట్ల 64లక్షల 23, 356భర్త : 6కోట్ల 12లక్షల 30, 87611కోట్ల 76లక్షల 54వేల 232 ఉంది. నామినేషన్‌ సమర్పించిన ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ ు- మరోసారి ఆశీర్వదించండి ు- ఏడు నియోజకవర్గాలకు సమానంగా నిధులు ు- ప్రజాశక్తి, విజయనగరం కోట ు- వైఎస్‌ఆర్సిపి విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ ఈరోజు స్థానిక విజయనగరం కలెక్టరేట్లో కలెక్టర్కు నామినేషన్‌ పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మద్ది శ్రీనివాసరావు సహాయ సహకారాలతో మరోసారి ఎంపీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభివద్ధి సంక్షేమం రెండు కల్లుగా చేసుకొని ప్రజలకు పరిపాలన అందించారు అదేవిధంగా విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న నిధులను సమానంగా పంచడం జరిగిందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి విద్య వైద్యానికి పెద్దపీట వేసి దేశంలోనే ముందుండే విధంగా కషి చేశారన్నారు. నా ఎంపీ పరిధిలోనే విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ను తీసుకురావడం గాని, అదేవిధంగా అండర్‌ బ్రిడ్జిలు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి గజపతినగరం నియోజకవర్గ శాసనసభ్యులు బొత్సయ్య ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ముందుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి వైఎస్‌ఆర్సిపి నాయకులు బైకులతో కార్లతో భారీ సంఖ్యలో ర్యాలీగా వచ్చి స్థానిక కలెక్టరేట్‌ కు చేరుకోవడం జరిగింది మందు గుండు డప్పులు డీజే ఇతర సౌండ్లతో అభిమానులు పైకి ర్యాలీగా భారీ ఎత్తున రావడం జరిగింది.

➡️