వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి

Dec 26,2023 16:25 #Konaseema

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : కపిలేశ్వరపురం మండలంలోని అంగర గాంధీ సెంటర్‌లో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని, మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి జయంతిని, మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు పలువురు వక్తలు కొనియాడారు. అలాగే మాజీ మంత్రి స్వర్గీయ సంగీత వెంకట రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పామర్రు, ఆలమూరు శాసన సభ్యుడిగా ప్రాతినిత్యం వహించిన సంగీత వెంకట రెడ్డి మంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు . ఈ కార్య క్రమంలో జెడ్పిటిసి పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ వాసా కోటేశ్వర రావు, వైస్‌ ప్రెసిడెంట్‌ యర్రా వీరన్న బాబు, , గంగుమళ్ళ రాంబాబు, పసలపూడి శ్రీనివాస్‌, ప్రగడ అర్జున్‌ రావు , బడుగు రాంబాబు, వాసంశెట్టి శ్రీనివాస్‌, చేనేత సొసైటీ చైర్మన్‌ రాంబాబు , వంగా నల్ల శ్రీను, పాలంగా కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️