36 గంటల ధర్నాను జయప్రదం చేయండి

Dec 11,2023 23:20
14 , 15 తేదీల్లో

ప్రజాశక్తి – యంత్రాంగం

ఈ నెల 14 15 తేదీల్లో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న ఆశా వర్కర్ల 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లావ్యాప్తంగా సోమవారం గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కాకినాడ 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఆశావర్కర్లు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసిన ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ నెల 14, 15 తేదీల్లో చేపడుతున్న 36 గంటల ధర్నాలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు పాల్గొని జయప్రయతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్‌ కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు భారతి, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణి, పచ్చిపాల గమ్య, దండుప్రోలు జ్యోతి, తలుపులమ్మ దేవి, భవాని, కుమారి, ఉమా తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14, 15 తేదీల్లో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న 36 గంటల దీక్షను జయప్రదం చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మండల ఆశా వర్కర్ల సమావేశం నొక్కు లలిత అధ్యక్షతన జరిగింది. ఈ సమవేశంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ప్రభుత్వ మరియు మెడికల్‌ లీవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారుఈ సమావేశంలో ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు శాంతి, భాగ్యం, వెంకటలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నర్ల ఈశ్వరి ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 14 , 15 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో జరిగే 36 గంటల ధర్నాను జయప్రం చేయాలని ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బి.వరలక్ష్మి, బి.జలమణి, పి.సలోమణి, పి.లావణ్య, ఎన్‌.విజయ, కె.రమాదేవి, ఎన్‌.కుమారి, ఎస్‌.శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️