500 మందికి దుప్పట్లు, చీరల పంపిణీ

వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-రామచంద్రపురం

ద్రాక్షారామలో 500 మంది వృద్ధులు, వికలాంగులు, పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సత్య సాయి ట్రస్ట్‌ ఫర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ విశాఖకు చెందిన శివకోటి మధుసూధనరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. భీమేశ్వర స్వామి అతిథి గృహం వద్ద వారం దరికీ భోజనం, ప్రసాదాలు,అందజేశారు. మధుసూధనరావు మాట్లా డుతూ ప్రతీ ఏటా తమ బృందం 50 మంది సభ్యులు తో విశాఖ నుంచి ద్రాక్షారామ వచ్చి పేదలకు సేవ చేస్తున్నామన్నారు. విశాఖలో కెజిహెచ్‌ వద్ద ప్రతి రోజూ 500 మందికి ఉచితంగా భోజ నం ఏర్పాటు చేస్తామ న్నారు. నేటికి 14 ఏళ్లుగా ద్రాక్షారామ వస్తున్నామన్నారు. కార్య క్రమంలో ట్రస్ట్‌ సభ్యుడు ఇవటూరి రవి కిరణ్‌, మాజీ సర్పంచ్‌ యాట్ల చిన్న అప్పారావు, విస్సా ప్రగడ కృష్ణ మూర్తి, విజయలక్ష్మి, యాట్ల నాగేశ్వరరావు, మాకం కామేశ్వరరావు, వై. జగదీష్‌ బాబు, ఎం.శ్రీనివాస్‌, ఎం.పద్మావతి, పి.లక్ష్మి, వై.అనితా, ట్రస్ట్‌సభ్యులు పాల్గొన్నారు.

 

 

➡️